ఫేడ్ అవుట్ నుంచి ఫుల్ ఫామ్ లోకి

44
- Advertisement -

సంక్రాంతి సినిమాల రిజల్ట్ తరువాత ఫ్యాన్స్ కు మోస్ట్ ఫెవరెట్ హీరోయిన్ గా మారింది శ్రుతిహాసన్. ముఖ్యంగా మెగా హీరోలు కష్టాల్లో ఉన్న టైంలో శృతితో సినిమా చేస్తే చాలు.. బ్లాక్ బస్టర్ పక్కా అన్న కంక్లూజన్ కి వచ్చేశారు మెగా ఫ్యాన్స్. గతంలో పవన్ తో ‘గబ్బర్ సింగ్’, చెర్రీతో ‘ఎవడు’, బన్నీతో ‘రేసుగుర్రం’.. తాజాగా చిరుతో ‘ వాల్తేరు వీరయ్య’సినిమాలో నటించి తన సత్తా చాటింది శ్రుతిహాసన్. మొత్తమ్మీద ఈ సినిమాలు కారణంగా శ్రుతిహాసన్ కెరీర్ కూడా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగింది. ముఖ్యంగా ఈ సంక్రాంతి హడావుడి మొత్తం శ్రుతిహాసన్ దే.

ఈ సంక్రాంతి కానుకగా పోటాపోటీగా విడుదలైన అటు వీరసింహారెడ్డి సినిమాలో, ఇటు వాల్తేరు వీరయ్య సినిమాలోనూ మెయిన్ హీరోయిన్ శ్రుతిహాసనే. పైగా రెండు సినిమాల్లోనూ శ్రుతిహాసన్ పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉంది. శ్రుతిహాసన్ కూడా రెండు సినిమాల్లో చాలా బాగా నటించింది. ఆమె నటనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. విదేశాల్లోనూ జనం బ్రహ్మరథం పడుతున్నారు. మొత్తానికి ఫేడ్ అవుట్ దశలో ఉన్న శ్రుతిహాసన్ కెరీర్ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టు అయ్యింది.

దాంతో శ్రుతిహాసన్ కి ఇప్పుడు వరుసగా సినిమా అవకాశాలు పెరుగుతున్నాయి. తాజాగా మరో సీనియర్ హీరో సినిమా వచ్చింది. F3, ఓరి దేవుడా సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు వెంకటేష్. ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను హిట్-2 డైరెక్టర్ శైలేశ్ కొల‌ను తో చేయనున్నాడు వెంకీ. అయితే ఈ సినిమాకు హీరోయిన్ గా శ్రుతిహాసన్ ను తీసుకోబోతున్నారని.. శ్రుతిహాసన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లు కుదిరితే ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ లో మొదలుపెట్టి.. వచ్చే దసరాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఓవరాల్ గా శ్రుతిహాసన్ ఫేడ్ అవుట్ లో నుంచి ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది.

ఇవి కూడా చదవండి…

భోళా శంకర్ షూటింగ్ పునఃప్రారంభం

వైరల్ : దిల్ రాజు ‘పెన్’ లవ్ స్టోరీ

2 మిలియన్ చేరువలో ‘వీరయ్య’

- Advertisement -