2 మిలియన్ చేరువలో ‘వీరయ్య’

16
- Advertisement -

సంక్రాంతి బరిలో నిలిచిన మెగా స్టార్ ‘వాల్తేరు వీరయ్య’ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అనిపించుకుంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ దాటేసిన ఈ సినిమా డెబ్బై కోట్ల షేర్ వసూళ్లు చేసిందని తెలుస్తుంది. ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు రాబడుతూ మెగా స్టార్ స్టామినా చూపిస్తుంది వీరయ్య. ఇప్పటికే ఓవర్సీస్ లో 1 .9 k మిలియన్ క్రాస్ చేసిన ఈ సినిమా 2 మిలియన్ మార్క్ కి అతి దగ్గరలో ఉంది.

గతంలో చిరంజీవి నటించిన ‘ఖైదీ 150 ‘, ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాలు ఓవర్సీస్ లో 2 కే మిలియన్ కలెక్షన్స్ సాదించాయి. గాడ్ ఫాదర్ ఆశించిన వసూళ్లు అందుకోలేకపోయింది. ఓవర్సీస్ లో వాల్తేరు వీరయ్య కి వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే 2 మిలియన్ దాటేసి కలెక్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఓవర్స్ సీస్ లో శ్లోక ఎంటర్టైన్ మెంట్ సంస్థ ద్వారా వాల్తేరు వీరయ్య , వీరసింహ రెడ్డి సినిమాలు అయ్యాయి.

ఇవి కూడా చదవండి…

రేపటి నుండి యాక్షన్ లోకి మహేష్

ఓన్లీ ఎక్స్ పోజింగ్ తోనే ప్రయాణం!

ఎట్టకేలకు పోలీస్ గా ప్రభాస్

- Advertisement -