కమల్‌ బయోపిక్‌పై క్లారిటీ!

9
- Advertisement -

లోక నాయకుడు కమల్ హాసన్‌ వారసురాలిగా ఇండస్ట్రీలో రాణిస్తోంది నటి శృతి హాసన్. ప్రస్తుతం డెకాయిట్‌ , సలార్‌ -2 , తమిళంలో చెన్నై స్టోరీ సినిమాలతో బిజీగా ఉన్నారు శృతి. తాజాగా ఇనియేల్ పేరుతో ఓ ప్రైవేట్ అల్బమ్‌ని రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఆ సందర్భంగా ఫ్యాన్స్ తో చిట్‌చాట్‌గా ముచ్చటించింది శృతి. ఈ సందర్భంగా ఓ నెటిజన్ కమల్‌హాసన్‌ బయోపిక్‌ని మీరు తీస్తారా? అని ప్రశ్నించారు. దానికి ఆ అవకాశమే లేదని చెప్పుకొచ్చింది.

తన తండ్రి జీవిత చరిత్రని సినిమాగా తీయలంటే ఎంతో అవగాహన, గట్స్‌ ఉండాలి. దానికి నేను సరైన వ్యక్తి కాదు అని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఉన్నారు. వారైతే అద్భుతంగా నాన్న జీవితాన్ని తెరకెక్కించగలరు అని కమల్ బయోపిక్‌పై క్లారిటీ ఇచ్చేసింది.

Also Read:మహేష్ బాటలో నితిన్?

- Advertisement -