రకుల్ ప్రీత్ సింగ్ హిందీ చిత్రం ‘ఛత్రీవాలీ’ త్వరలో ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ.. పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. తన కెరీర్ ఆరంభంలో ఎన్నో కష్టాలు పడ్డానని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించింది. ఆ ఇంటర్వ్యూలో రకుల్ ఇంకా ఏమి మాట్లాడిందో ఆమె మాటల్లోనే విందాం.. ‘ఇండస్ట్రీలో నాకు బ్యాక్ గ్రౌండ్ లేదు. ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారేది. చాలా సార్లు నాతో షూటింగ్ చేసి, చివరికి వేరే హీరోయిన్‌ను తీసుకునేవారు. ఎందుకో నాకు అప్పట్లో అర్ధం అయ్యేది కాదు. నేడు రకుల్ ప్రీత్ సింగ్ అంటే గొప్ప అందగత్తె అని అందరూ అంటుంటారు. కానీ, నా కెరీర్ స్టార్టింగ్ లో నేను కొన్ని యాంగిల్స్ లో బాగాలేను అంటూ నన్ను సడెన్ గా సినిమాల నుంచి తొలగించే వారు’ అని రకుల్ చెప్పింది.
ఇంకా రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ..’అందరికీ తెలుసు. సినిమా పరిశ్రమలో ఒక హీరోయిన్ కి ఎలాంటి కష్టాలు ఉంటాయో. ఐతే, కష్టాలను చూసి భయపడుతూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేం. కష్టాలనే ఇష్టాలను చేసుకోవాలి. అలాగే సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అన్నిటికీ కంటే ముఖ్యంగా ఎవర్నీ నమ్మాలో తెలుసుకోవాలి. వీటన్నిటితో పాటు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. నేను ఆ విధంగానే అడుగులు వేశాను కాబట్టే ఈ రోజు నేను ఈ స్థాయికి చేరుకున్నాను. ఇదంతా పోరాటం అని నేను అనుకోవట్లేదు. అసలు ఏదైనా ఈజీగా దక్కాలనుకునే మనస్తత్వం నాది కాదు’ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొంది.
అలాగే రకుల్ ప్రీత్ సింగ్ స్కూల్ సిలబస్‌లో సేఫ్ సెక్స్ టాపిక్ గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ విషయం పై రకుల్ మాట్లాడుతూ.. స్కూల్ సిలబస్‌లో సేఫ్ సెక్స్ టాపిక్‌ని చేర్చాలి. ఇలాంటి విషయాలు పిల్లలు మాట్లాడకూడదు అని అనడం మానేసి వారికి సరైన అవగాహన కలిపించాలి. అప్పుడే పిల్లలకు మేలు జరుగుతుంది. ఇంతకీ రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నట్టు ఉండి ఈ టాపిక్ ఎందుకు మాట్లాడింది అంటే.. ఆమె నుంచి రాబోతున్న హిందీ చిత్రం ‘ఛత్రీవాలీ’ సినిమాలో రకుల్ సురక్షితమైన శృంగారం గురించి పాఠాలు నేర్పే కెమిస్ట్రీ టీచర్ పాత్ర చేసింది. అందుకే ఆమె ఈ టాపిక్ మీద కామెంట్స్ చేసింది.
ఇవి కూడా చదవండి…