టీ20 కెప్టెన్‌ శ్రేయాసే!

7
- Advertisement -

భారత టీ20 (T20I) జట్టు కెప్టెన్సీ నుండి సూర్యకుమార్ యాదవ్‌ను తొలగించడం దాదాపు ఖాయమవ్వడంతో ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందించారు.

భారత జట్టులో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పేలవమైన ప్రదర్శన, నిరాశాజనకమైన ఐపీఎల్ సీజన్ తర్వాత బీసీసీఐ ఓపిక నశించినట్లు కనిపిస్తోంది. భవిష్యత్తులో భారత్ ఆడబోయే టీ20 సిరీస్‌ల నుండి సూర్యకుమార్ యాదవ్‌ను పూర్తిగా పక్కన పెట్టే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చారు ఆకాష్ చోప్రా.

సూర్యకుమార్ స్థానాన్ని శ్రేయస్ అయ్యర్ రిప్లేస్ చేయగలడని.. ఒకవేళ సూర్య అక్కడ లేకపోతే మరియు మీరు మరొకరి వైపు చూస్తుంటే.. నా ఓటు ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్‌కే ఉంటుంది అని చెప్పాడు ఆకాష్. రజత్ పాటిదార్‌ను కూడా జట్టులోకి తీసుకురండి…. అయితే కెప్టెన్సీ బాధ్యతలను మాత్రం శ్రేయస్ అయ్యర్ భుజాలపైనే నేను చూస్తున్నాను….ఎందుకంటే ఆయనకు మంచి అనుభవం ఉంది అని ఆకాష్ చోప్రా అన్నారు.

Also Read:FD డిటైల్స్ మర్చిపోయారా..అయితే మీకోసమే?

వైట్-బాల్ (పరిమిత ఓవర్ల) క్రికెట్‌లో శ్రేయాస్ అద్భుతంగా రాణించారు.  చాలా చాలా మంచి ఆటగాడు. ప్రపంచకప్‌లో నంబర్ 4 స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక ఆటగాడు ఆయనే. కాబట్టి ఆయన ఒక నిరూపితమైన ప్రదర్శనకారుడు అని చోప్రా విశ్లేషించారు.

- Advertisement -