FD డిటైల్స్ మర్చిపోయారా..అయితే మీకోసమే?

2
- Advertisement -

మీ తాతలు లేదా తల్లిదండ్రులు ఏళ్ల క్రితం ఏదైనా ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) చేసి దానికి సంబంధించిన సర్టిఫికేట్ లేదా వివరాలు ఇప్పుడు కనిపించకుండా పోయాయా? లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఏదైనా కంపెనీ షేర్లను కొనుగోలు చేసి వాటి గురించి మర్చిపోయారా? అయితే ఇది మీకోసమే. ప్రజలు తాము చేసిన పెట్టుబడులను మర్చిపోయే ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. కుటుంబంలో జరిగే అనుకోని ప్రమాదాలు లేదా ఇతర కారణాల వల్ల నామినీలు కూడా ఆ పెట్టుబడుల వివరాలను తెలుసుకోలేకపోతుంటారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు మరియు మ్యూచువల్ ఫండ్ హౌస్‌లలో కోట్ల రూపాయలు ఎవరూ క్లెయిమ్ చేయకుండా అలానే పడి ఉన్నాయి.

ఈ సమస్యను పరిష్కరించడానికి, భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (DFS)…పౌరులు తమ అన్‌క్లెయిమ్డ్ సొమ్మును వెతకడానికి మరియు గుర్తించడానికి ఒకే ఒక ఉమ్మడి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది. అన్‌క్లెయిమ్డ్ ఆర్థిక ఆస్తుల సమాచారాన్ని సులభంగా పొందేలా చేయడానికి పీఎస్‌బీ (PSB) అలయన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని ఈ పోర్టల్‌ను రూపొందించారు.

ఈ పోర్టల్‌ను https://www.unclaimedassetsportal.in వెబ్‌సైట్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. దీనిని ప్రభుత్వ దేశవ్యాప్త ప్రచారం ‘యువర్ క్యాపిటల్…యువర్ రైట్’ లో భాగంగా ప్రారంభించారు. ఇది దేశంలోని మొత్తం ఆర్థిక వ్యవస్థను ఒకే తాటిపైకి తీసుకువచ్చింది. గతంలో ప్రజలు తమ మర్చిపోయిన ఆస్తులను గుర్తించడానికి వేర్వేరు ప్లాట్‌ఫారమ్‌లను సందర్శించాల్సి వచ్చేది. ఉదాహరణకు, ఇప్పటివరకు బ్యాంక్ డిపాజిట్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ‘ఉద్గమ్’ (UDGAM) పోర్టల్‌ను…మ్యూచువల్ ఫండ్స్ కోసం సెబీ (SEBI) కి చెందిన ‘మిత్ర’ (MITRA) పోర్టల్‌ను మరియు ఇన్సూరెన్స్ కోసం ఐఆర్‌డీఏఐ (IRDAI) పోర్టల్‌ను విడివిడిగా సందర్శించాల్సి వచ్చేది.

ఈ ఇబ్బందులు మరియు శ్రమ కారణంగా చాలా మంది తమ ఆస్తుల కోసం వెతకడం మానేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ వివిధ డేటాబేస్‌లను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోకి అనుసంధానించింది, దీనివల్ల ప్రజలు తమ ఆస్తులను గుర్తించడం మరియు క్లెయిమ్ చేయడం సులభం అవుతుంది. కొత్త కామన్ ల్యాండింగ్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా తమ అన్‌క్లెయిమ్డ్ ఆస్తుల సమాచారాన్ని ఒకే చోట కనుగొనవచ్చు.

()గత 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా ఎటువంటి లావాదేవీలు జరగని మరియు ఆ డిపాజిట్లు ఆర్‌బీఐ (RBI) కి బదిలీ చేయబడిన సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాల వివరాలు.

()ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత కూడా ఏదో ఒక కారణం చేత పాలసీదారునికి లేదా వారి కుటుంబానికి చేరకుండా ఇన్సూరెన్స్ కంపెనీల వద్దే ఉండిపోయిన డబ్బు.

()షేర్లు మరియు అన్‌క్లెయిమ్డ్ డివిడెండ్‌లు.. కంపెనీల షేర్లు మరియు డివిడెండ్‌లు ఏడేళ్లపాటు ఎవరూ క్లెయిమ్ చేయకుండా ఉండి, ఆ తర్వాత ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ (IEPF) కి బదిలీ చేయబడినవి.

() మ్యూచువల్ ఫండ్ స్కీములలో పెట్టుబడి పెట్టి, ఇన్వెస్టర్లు ఏళ్ల తరబడి రిడీమ్ (వెనక్కి తీసుకోకుండా) చేయకుండా వదిలేసిన సొమ్ము. సాధారణ ప్రజలకు అనుకూలంగా ఉండేలా ప్రభుత్వం ఈ పోర్టల్‌ను చాలా సరళతరం చేసింది. ఇది పూర్తిగా సురక్షితమైనది మరియు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
మీరు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ ఖాతాదారుని పూర్తి పేరు వంటి ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత సెర్చ్ చేస్తే సిస్టమ్ తన డేటాబేస్‌లో శోధించి…మీ పేరుతో లింక్ అయి ఉన్న అన్ని రకాల ఆస్తులు లేదా నిధుల జాబితాను స్క్రీన్‌పై చూపిస్తుంది. దీని ద్వారా మీ పేరు మీద ఏదైనా అన్‌క్లెయిమ్డ్ డబ్బు లేదా ఆస్తి ఉందో లేదో మీరు సులభంగా తెలుసుకోవచ్చు.

- Advertisement -