టీ20 కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్

1
- Advertisement -

భారత క్రికెట్‌లో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు ఈ ఏడాది జరగనున్న ఆసియా క్రీడలు  కోసం బీసీసీఐ శనివారం టీం ఇండియా టీ20 జట్లను ప్రకటించింది. ఈ ఎంపికలో సెలెక్షన్ కమిటీ అత్యంత సంచలన, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది.

ఇటీవలే భారత జట్టుకు టీ20 ప్రపంచకప్ అందించినప్పటికీ, ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్‌పై వేటు వేసిన సెలెక్టర్లు.. భారత సరికొత్త టీ20 సారథిగా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను నియమించారు. అలాగే ఈ ఏడాది ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీని తొలిసారి సీనియర్ జాతీయ జట్టుకు ఎంపిక చేశారు.

Also Read:అంబేద్కర్ పుస్తకంతో అభిజిత్..

భారత టీ20 జట్టు:

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ,  శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్.

- Advertisement -