టీమిండియాలోకి వైభవ్..సరికాదు!

6
- Advertisement -

త్వరలో జరగబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌ల కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. ఈ సిరీస్‌తో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.

భారత టీ20 జట్టులోకి అతన్ని వెంటనే ఎంపిక చేసే అవకాశం ఉందనే వార్తలపై రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వీడియోలో మాట్లాడారు. ఈ యువ ఆటగాడి ఫామ్ చూసి ప్రస్తుతం భారత జట్టులో ఉన్న టాప్-3 బ్యాటర్లు తమ స్థానాల గురించి కచ్చితంగా ఆందోళన చెందుతుంటారని ఆయన అన్నారు.

ప్రస్తుతం నడుస్తున్న ప్రచారం చూస్తుంటే టాప్ త్రీ బ్యాటర్లు తమ స్థానాల గురించి కంగారు పడుతుంటారు. గత ఐదారు ఏళ్లుగా సెలెక్షన్లు చాలా కఠినంగా (నిర్దాక్షిణ్యంగా) జరుగుతున్నాయి. కానీ నా ఉద్దేశంలో ఒక జట్టును నిర్మించడానికి ఇది చాలా తప్పు పద్ధతి…. ఈ వైభవ్ సూర్యవంశీ క్రేజ్ కారణంగానే.. జట్టులో స్థిరంగా కొనసాగాలంటే సీనియర్ ఆటగాళ్లు కూడా నిరంతరం తమ ఆటను మెరుగుపరుచుకుంటూ ఉండాలి అని అశ్విన్ చెప్పారు.

సూర్యవంశీని జట్టులోకి తీసుకోవడం కోసం ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాడిని బీసీసీఐ పక్కన పెట్టకూడదని అశ్విన్ అభిప్రాయపడ్డారు. ఈ యువ ఆటగాడితో సెలెక్టర్లు సరిగ్గా మాట్లాడాలని, జట్టులో అవసరం ఉన్నప్పుడు కచ్చితంగా అవకాశం ఇస్తామని అతనికి భరోసా ఇవ్వాలని చెప్పారు.

Also Read;అర్థమయిందా..నాగబాబు!

వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకురావాలనే ఏకైక కారణంతో మరొకరిని జట్టు నుంచి తొలగించకండి. అది సరైన కారణం కాకూడదు. టెస్ట్ జట్టులో సాయి సుదర్శన్‌కు ఇచ్చినట్లే, అందరు ఆటగాళ్లకు జట్టులో స్థిరత్వం (భద్రత) ఇవ్వాలి…నిన్ను జట్టులో చేర్చడం కోసం మేము ఉన్న జట్టును మార్చలేము కానీ భారత జట్టుకు అవసరమైనప్పుడు నిన్ను ఖచ్చితంగా ఎంపిక చేస్తాము అని వైభవ్‌కు స్పష్టంగా చెప్పాలి అని అశ్విన్ అభిప్రాయపడ్డారు.

- Advertisement -