వివాదంలో హీరో విజయ్‌..

231
Shooting Underway Despite Industry Shutdown
- Advertisement -

డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల తీరుకు వ్యతిరేకంగా కోలీవుడ్ నిర్మాతల మండలి గత 16వ తేదీ నుంచి బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ బంద్‌ను ఒ స్టార్ హీరో ఉల్లంఘించాడంటూ కోలీవుడ్‌లో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అసలు వివరాల్లోకి వెళ్తే… డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ధరలు తగ్గించేలా చేయడంతో పాటు మరికొన్ని సమస్యల మీదా తమిళ నిర్మాతలందరూ ఉమ్మడిగా పోరాడుతున్నారు. ఈ పోరాటానికి నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ నేతృత్వం వహిస్తున్నాడు. అయితే అందరూ ఏకతాటిపై నడుస్తున్న సమయంలో ఒక చిత్ర యూనిట్ మాత్రం రూటు మార్చింది.

Shooting Underway Despite Industry Shutdown

డిజిటల్ ప్రొవైడర్లతో చర్చలు జరుగుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో సమస్య కొలిక్కి వస్తుందని నిర్మాతలు భావించారు. కానీ ఇంతలో చెన్నైలోని సెంట్రల్ సమీపంలో విక్టోరియా హాలు వద్ద తమిళ అగ్రనటుడు విజయ్ ప్రధాన పాత్రలో మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘విజయ్‌ 62’ సినిమా షూటింగ్‌ నిర్వహించారన్న వార్తలు వివాదం రేపాయి.

విజయ్ షూటింగ్ నిర్వహించడంపై పలువురు నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రనటులకో న్యాయం, చిన్న సినిమా నిర్మాతలకో న్యాయమా? అని ప్రశ్నించారు. నిర్మాతల మండలిలో ఐక్యత లేదని, పెద్ద చిత్రాల షూటింగ్‌లకు అనుమతిచ్చి, చిన్న నిర్మాతలకు అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. బంద్‌ లో కూడా పక్షపాతం చూపించడం ఎంతవరకు సమంజసమని వారు నిలదీశారు. మరి ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

- Advertisement -