‘మఫ్టీ’ రీమేక్‌లో బాలయ్య..

192
- Advertisement -

స్వర్గీయ నటరత్న శ్రీ నందమూరి తారకరామారావు జీవిత ఆధారంగా తెరకెక్కబోయే సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ కోసం సర్వం సిద్ధం చేసుకున్నాడు. బయోపిక్‌లో బాలయ్య దాదాపు 40 గెటప్స్ లలో కనిపించనున్నాడు. మార్చ్ 29న సినిమా ప్రారంభోత్సవం జరగనుంది.

ఈ సినిమా తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేయనున్నారు. బాలకృష్ణ పుట్టిన రోజైన జూన్ 10వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేస్తారు. క్రేజీ కాంబినేషన్ కావడంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ ప్రాజెక్టుపైనే వుంది. ఇక ఈ రెండు సినిమాలు మొదలు కాకముందే బాలయ్య మరొ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Balakrishna In 'Mufti' Remake?

కన్నడ లో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన సినిమా ‘మఫ్టీ’. ఈ మూవీ అక్కడ 100 కోట్లను కొల్లగొట్టింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని బాలయ్య తెలుగులో రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్యకు మిత్రుడైన కన్నడ హీరో శివరాజ్ కుమార్ ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ రోల్ లో కనిపించారు. ఈ సినిమా శివరాజ్ కుమార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో సినిమా కంటెంట్ పై బాలయ్య మనసుపడ్డాడు. ఈ మూవీకి సంబంధించిన వివరాలు ఇంక తెలియాల్సివుంది.

- Advertisement -