జడేజాపై బూటు విసిరారు…

283
Shoes were flung from the top tier of a stand
- Advertisement -

తమిళనాడులో కావేరి మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ నిర్వహించవద్దని సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు, తమిళ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. మంగళవారం చెన్నై, కోల్‎కత్తా మధ్య జరిగిన మ్యాచ్‎లో అపశృతి చోటుచేసుకుంది. బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న జడేజాపై గుర్తు తెలియని వ్యక్తులు షూ విసిరారు. కోల్‎కత్తా ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఎవరు విసిరారన్నది ఇంకా తెలియలేదు. అదే సమయంలో బౌండరీ బయట సౌతాఫ్రికా ప్లేయర్స్ డుప్లెసిస్, ఎంగిడి అక్కడే ఉన్నారు. ఆ షూను డుప్లెసిస్‎యే బయటకు తీసుకెళ్లాడు.

Shoes were flung from the top tier of a stand

మరోవైపు మ్యాచ్ ప్రారంభానికి ముందే స్టేడియం వద్ద ఆందోళన కారులు నిరసనలు తెలిపారు. దీంతో కనీవినీ ఎరగని రీతిలో 4 వేల మంది పోలీసులతో భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు అందరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే స్టేడియం లోపలికి పంపించారు పోలీసులు. స్టేడియంలోకి వచ్చిన తర్వాత కూడా కొందరు ఆందోళన కారులు నినాదాలు చేయగా పోలీసులు వారిని బయటకు తీసుకెళ్లారు.

- Advertisement -