నా పేరు సూర్య ..చీఫ్‌ గెస్ట్‌గా సాహో..!

292
Prabhas to be the chief guest for Allu Arjun’s 'Naa Peru Surya' pre-release event?
- Advertisement -

మెగా ఫ్యామిలీ హీరోలలో ఎవరి సినిమా ఆడియో ఫంక్షన్ లు లేదా సక్సెస్‌ మీట్ లు జరిగిన మెగాస్టార్ చిరంజీవో, పవర్ కల్యాణ్ రావాల్సిందే. అలాంటిది ఇప్పుడు తాజాగా బన్నీ నటిస్తున్న ‘నా పేరు సూర్య’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ త్వరలో జరగనుంది. ఈ వేడుకకు ఓ స్టార్ హీరోను ఆహ్వానించారని తెలుస్తోంది.

 Prabhas to be the chief guest for Allu Arjun’s 'Naa Peru Surya' pre-release event?

ఈ మధ్యే మహేష్‌ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. అదే దారిని ఎంచుకున్నట్లు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక విషయానికొస్తే బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ను ఆహ్వానించారని సమాచారం.

కాగా వారి ఆహ్వానాన్ని ప్రభాస్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి వక్కంతపు వంశి దర్శకత్వం వహిస్తున్నారు. రామలక్ష్మీ సినీ క్రియేషన్ పతాకంపై శిరిషా శ్రీధర్ లగడపాటి నిర్మిస్తున్నారు. విశాల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మే 4న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

- Advertisement -