గుంటూరు కారం.. నిజంగా షాకింగే!

220
- Advertisement -

సంవ‌త్స‌రన్న‌ర గ్యాప్ త‌ర్వాత మ‌హేష్ బాబు సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌స్తుండ‌టంతో ఫ్యాన్స్ గుంటూరు కారం కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూశారు. దానికి తోడు ఈసారి త్రివిక్ర‌మ్‌ దర్శకత్వంలో సినిమా రావడంతో ఈ సినిమాపై మంచి హైప్ కూడా ఉంది. దానికి త‌గ్గ‌ట్టే గుంటూరు కారం టికెట్ బుకింగ్స్ కూడా ఆ స్థాయిలోనే జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. నిజంగా ఒక ప్రాంతీయ సినిమాతో మ‌హేష్ ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్‌ను సాధించాడంటే మామూలు విష‌యం కాదు. కాకపోతే, ఈ సినిమాకి వచ్చిన టాకే చాలా బ్యాడ్ గా ఉంది. గుంటూరు కారంలో మ్యాటర్ తక్కువ, బిల్డప్ ఎక్కువ అంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

త్రివిక్రమ్ పని అయిపోయింది అంటూ గురూజీ పై కూడా నెగిటివ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మెయిన్ గా సెకండ్ హాఫ్, రొటీన్ స్టోరీలా ఉందని పోస్ట్ లు పెడుతున్నారు. అటు‘గుంటూరు కారం’ సినిమాకి రివ్యూస్ కూడా నెగిటివ్ గానే వచ్చాయి. పైగా హను మాన్ సినిమాకి సూపర్ హిట్ రావడం కూడా గుంటూరు కారం సినిమా పై బాగా ఎఫెక్ట్ పడేలా ఉంది. అసలు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాకి ఇంత నెగిటివ్ టాక్ రావడం నిజంగా షాకింగే. ఈ సినిమా అంతా ఓ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. సినిమా ప్రారంభంలోనే అసలు కథ ఏంటి? కథనం ఎలా సాగబోతుందనేది రివీల్ చేసేశారు.

అలా చేసినప్పుడు ఇంక ఇంట్రెస్ట్ ఏమి ఉంటుంది ?, మహేశ్ బాబు తనదైన కామెడీ టైమింగ్‌తో ఇరగదీశాడు అంటున్నారు గానీ, కొన్ని చోట్ల మహేష్ ఓవర్ గా చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఏది ఏమైనా గుంటూరు కారం ఘాటు మాత్రం కాస్త తగ్గిందనే చెప్పాలి. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 3 వ వారంలో కానీ, చివరి వారంలో కానీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి అటు ఓటీటీలోనైనా గుంటూరు కారం హిట్ అవుతుందా చూద్దాం.

Also Read:Harishrao:బీఆర్ఎస్‌కు ప్రజలంటే బాధ్యత

- Advertisement -