బిగ్ బాస్ 7:శివాజీ ఔట్

101
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు గ్రాండ్ ఫినాలే లో ఫైనల్‌కు చేరుకుంది. యావర్ రూ.15 లక్షలతో బయటకు రాగా ప్రియాంక,అర్జున్ తొలుత బయటకు వచ్చారు. ఆరు సీజన్లలో ఒక్క అమ్మాయి కూడా విజేతగా నిలవలేదు.ఈసారి కూడా అదే రిపీట్ అయింది. ప్రియాంకతో పాటు అర్జున్ కూడా ఎలియినేట్ అయ్యారు.

ప్రియాంక ఎలిమినేషన్ ప్రాసెస్‌ను స్వయంగా మాస్ మహారాజ రవితేజ చేతుల మీదుగా జరిగింది. ఒక అమ్మాయిని నా చేతులతో ఎలిమినేట్ చేసినందుకు బాధగా ఉందంటూ రవి తేజ అన్నారు.
అంతకముందు ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన అర్జున్ అంబటియే టాప్-6 నుంచి ఫస్ట్ ఎలిమినేట్ అయ్యాడు. యాంకర్ సుమ.. లోపలికి వెళ్లి తన ఫ్రెండ్ రోబోతో అర్జున్‌ని ఎలిమినేట్ చేయించింది.

తర్వాత హౌస్ నుంచి స్టేజ్ మీదకి అర్జున్‌ని తీసుకువచ్చింది సుమ. ఇక స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత అర్జున్‌ గేమ్‌పై నాగ్ ప్రశంసలు కురిపించారు. ఇక అర్జున్ కోరిక తీరుస్తూ తన భార్య సురేఖను స్టేజ్ మీదకి రప్పించి ఒక ఫొటో తీయించారు నాగార్జున.

Also Read:Bigg Boss 7:రూ. 15 లక్షలతో బయటికొచ్చిన యావర్

- Advertisement -