70 రోజుల పాటు బుల్లితెరపై అలరించిన బిగ్ బాస్ సంగ్రామం ముగిసింది. ఫైనల్ రేసులో శివబాలాజీ, ఆదర్శ్ నిలవగా ప్రేక్షకుల మద్దతుతో శివబాలాజీ విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా ‘బిగ్ బాస్’ ట్రోఫీని, మనీ ప్రైజ్ ని జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు అందజేయగా…శివబాలాజీని తోటి ఆర్టిస్టులు ప్రశంసించారు
తాను విజేతగా నిలిచినందుకు ఆనందంగా ఉందన్నారు శివబాలాజీ. నేను విజేతగా నిలుస్తానని అనుకోలేదు. ఈ షో నుంచి మధ్యలో వెళ్లిపోతానని అనుకున్నాను.. నా కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా మంచి వ్యక్తులు. వాస్తవం చెప్పాలంటే వాళ్ల వల్లే నేను ఇంత ప్రశాంతంగా ఈ షోలో ఉండగలిగాను.
ఈ సందర్భంగా ‘లవ్ యూ’ అని ఎవరికి చెబుతారు? అని శివబాలాజీని జూనియర్ ఎన్టీఆర్ ప్రశ్నించగా, ‘హండ్రెట్ పర్సెంట్ మధుకే’ అంటూ తన భార్య పేరును శివబాలాజీ చెప్పడంతో కరతాళధ్వనులు మార్మోగిపోయాయి. నేను సాధించిన ఈ విజయంలో వాళ్ల పాత్ర కూడా ఉంది.. ఈ షో ద్వారా కంటెస్టెంట్ లందరూ చాలా క్లోజ్ అయిపోయారు నాకు. ఎంత క్లోజ్ గా అంటే నా బాల్య మిత్రుల లాగా. ఆడియన్స్ ఇంత సపోర్ట్ ఇస్తారని నేను ఊహించలేదు. ఇంటింటికీ, పేరు పేరునా ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ సో మచ్. పిల్లలకు నా ముద్దులు.. థ్యాంక్యూ సో మచ్’అని చెప్పాడు.