బిగ్ బాస్ 4 …లోపల సోషల్ డిస్టెన్స్ లేదు!

197
big boos 4

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమైంది. ప్రారంభంలో ఎప్పటిలాగే నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి సినిమాల్లోని పాటలకు స్టెప్పులేశారు. ఈ బిగ్ బాస్ సీజన్‌లో తొలి హౌజ్‌మేట్‌గా హీరోయిన్ మోనాల్ గజ్జర్ అడుగుపెట్టారు. సెకండ్ పార్టిసిపేట్‌గా సూర్య కిరణ్‌ దర్శకుడు బిగ్ హౌస్‌లో అడుగుపెట్టారు.

మూడో పార్టిసిపేట్‌గా యాంకర్ లాస్య హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా మోనాల్ గజ్జర్‌ని హగ్ చేసుకునే ప్రయత్నం చేయగా సోషల్ డిస్టెన్స్ అంటూ అనగా నాగార్జున హౌస్‌ లోపల సోషల్ డిస్టెన్స్ లేదంటూ సమాధానం ఇచ్చారు. నాలుగో పార్టిసిపెట్‌గా హీరో అభిజిత్ ఎంట్రీ ఇచ్చారు.

సోమ‌వారం నుండి శుక్రవారం వ‌ర‌కు రాత్రి 9.30ని.ల‌కు ప్ర‌సారం కానున్న ఈ షో శ‌ని, ఆది వారాల‌లో రాత్రి 9.00ల‌కు టెలికాస్ట్ కానుంది.