ఆపరేషన్ టైగర్..షిండే కొత్త స్కెచ్!

6
- Advertisement -

మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. డిప్యూటీ సీఎం, శివసేన నేత ఏక్‌నాథ్ షిండే ‘ఆపరేషన్ టైగర్’ పేరుతో కొత్త వ్యూహాన్ని ప్రారంభించినట్లు సమాచారం.

శివసేన (యూబీటీ)కు చెందిన ఎంపీలను తన వైపు తిప్పుకునేందుకు షిండే ప్రయత్నాలు చేస్తున్నారని వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఆయన యూబీటీ ఎంపీలలో పలువురిని కలిసినట్లు సమాచారం.అయితే, ఈ వార్తలను శివసేన (UBT) ఖండించింది. తమ పార్టీ ఎంపీలు అందరూ ఏకీభవంతో ఉన్నారని స్పష్టం చేసింది.

మహారాష్ట్రలో త్వరలో జరగనున్న శాసన మండలి (MLC) ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మరోసారి రాజకీయ బలం చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు. మా పార్టీ ఎంపీలు అందరూ ఒక్కటే. ఇలాంటి వార్తలు హాస్యాస్పదం. రేపు నా పేరు, ఆదిత్య ఠాక్రే పేరు కూడా కలుపుతారు అంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.

మార్చి నెలలో షిండే ఢిల్లీ పర్యటన తర్వాత ఈ ఆపరేషన్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం శివసేనకు లోక్‌సభలో 7 మంది ఎంపీలు ఉన్నారు. యూబీటీకి చెందిన 9 మంది ఎంపీలు షిండే వైపు వస్తే, మొత్తం సంఖ్య 16కి పెరుగుతుంది. దీంతో ఎన్‌డీఏ బలం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

Also Read:KTR:జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యం కల్పిస్తాం

అయితే, ‘ఆపరేషన్ టైగర్’ అవసరం లేదని షిండే వర్గం చెబుతోంది. అయినప్పటికీ, ప్రతిపక్ష నేతలు తమతో సంప్రదింపుల్లో ఉన్నారని మంత్రి ఉదయ్ సామంత్ పేర్కొన్నారు.

- Advertisement -