ముకుల్ చౌదరి..ఓవర్ నైట్ హీరో!

6
- Advertisement -

ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న యువ ఆటగాడు ముకుల్ చౌదరి ఒక్క మ్యాచ్‌తోనే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై అతని అద్భుత ఇన్నింగ్స్ జట్టుకు విజయం అందించింది.

ఈ మ్యాచ్‌లో ముకుల్ చౌదరి కేవలం 27 బంతుల్లో అజేయంగా 54 పరుగులు చేసి, 7 సిక్సర్లు బాదాడు. 182 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసే సమయంలో 128/7 అనే క్లిష్ట పరిస్థితిలో జట్టును గెలిపించాడు.

లక్నో జట్టు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ, ముకుల్‌ను ఎంపిక చేయడంలో తమ డేటా అనలిస్ట్ శ్రినివాస్ కీలక పాత్ర పోషించారని చెప్పారు.కొన్ని నెలల క్రితం ట్రైనింగ్ క్యాంప్‌లో అతడిని చూశాం. మా డేటా అనలిస్ట్ శ్రినివాస్ ‘ఈ కుర్రాడిని తప్పకుండా తీసుకోవాలి’ అని చెప్పాడు. అందుకే మేము అతడిని కొనుగోలు చేశాం అని లాంగర్ తెలిపారు.

Also Read:KTR:జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యం కల్పిస్తాం

ఐపీఎల్ వేలంలో ముకుల్‌ను రూ. 2.6 కోట్లకు జట్టు దక్కించుకుంది. ముకుల్ ఆటతీరుపై ప్రశంసలు కురిపించిన లాంగర్, అతడిని కోహ్లీతో పోల్చారు. వికెట్ల మధ్య పరుగులు తీసే తీరు కోహ్లీలా ఉంటుంది. అతడు అద్భుతమైన అథ్లెట్. ఆటపై అవగాహన చాలా ఉంది. 300 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్నట్టుగా మాట్లాడుతాడు అని చెప్పారు.ముకుల్ ఇన్నింగ్స్‌పై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్, రిషబ్ పంత్ ప్రశంసలు కురిపించారు.

- Advertisement -