పరిశ్రమలతో యువతకు ఉపాధి కల్పించండి: సుభాష్ రెడ్డి

281
sheri subash reddy
- Advertisement -

పదహారవ శాసన  మండలి సమావేశాల్లో భాగంగా గురవారం నాడు ప్రారంభమైన నాలుగో  రోజు మండలి సమావేశాల్లో సభ్యులు శేరి సుభాష్ రెడ్డి స్పెషల్ మెన్షన్స్ కింద మెదక్ జిల్లా నిరుద్యోగ ఉపాధి కల్పన సమస్యను సభ దృష్టికి తీసుకొచ్చారు.మెదక్ జిల్లా గా ఏర్పడ్డప్పటికీ., మెదక్ పట్టణకేంద్రంగా ఉన్నప్పటికీ, మెదక్ పట్టణ ప్రాంత పరిధిలో పారిశ్రామిక అభివృద్ది జీరో స్థాయిలో ఉండడం బాధాకరమని అన్నారు.

ప్రత్యేక జిల్లా కేంద్రం గా ముఖ్యమంత్రిగారు మెదక్ ను ఏర్పాటు చేసినప్పటినుంచి ఈ ప్రాంత యువతకు నిరుద్యోగులకు ఉపాధి కల్పన జరుగుతుందనీ ఆశిస్తున్నారనీ, పారిశ్రామిక రంగ అభివ్రుద్ది కోసం ఎదురు చూస్తున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. సత్వరమే తగు చర్యలు చేపట్టి మెదక్ పట్టణం చుట్టూ ఉన్న ప్రభుత్వ భూముల్లో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ….మంత్రి కెటిఆర్ ను కోరారు.అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి కెటిఆర్, అందుకు తగు చర్యలు చేపడతామని సభా ముఖంగా హామీ ఇచ్చారు.

- Advertisement -