బిగ్ బాస్ 4…ఈ వారం ఎలిమినేషన్‌ లేనట్టే?

156
bigg boss telugu

బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 4విజయవంతంగా నాలుగు ఎపిసోడ్‌లను పూర్తిచేసుకుంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్‌లు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా వీరిలో తొలివారం ఎలిమినేషన్ ప్రక్రియలో గంగవ్వతో పాటు అభిజిత్, అఖిల్, మెహబూబ్, సుజాత, దివి, సూర్యకిరణ్‌లు నామినేట్ అయ్యారు.

ఈ నేపథ్యంలో తొలివారంలో ఎలిమినేట్ అయ్యేది ఎవరా అనేదానిపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉండదని….బిగ్ బాస్‌పై అటెన్షన్‌ పెంచేందుకు నాగార్జున ఎలిమినేషన్‌ ఉంటుందని తెలిపారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఒకవేళ ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటే వెంటనే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరికొంతమంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించేందుకు కసరత్తు చేస్తున్నారట. మొత్తంగా ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే వీకెండ్ వరకు వేచిచూడాల్సిందే.