శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం..!

5
- Advertisement -

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఓ పాట చిత్రీకరణను ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పండ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ శేఖర్ మాస్టర్ కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టినట్లు సమాచారం. ఈ అనూహ్య ఘటనతో ఆయన అభిమానులు, సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది.

సినిమా షూటింగ్‌లో భాగంగా పాట చిత్రీకరణ కోసం వెళ్లిన శేఖర్ మాస్టర్.. పని పూర్తయిన తర్వాత కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మార్గమధ్యలో పండ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ ఆయన కారును వెనుక నుంచి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీంతో కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎవరెవరు ఉన్నారు? వాహనం ఎంతమేరకు దెబ్బతింది? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ALso Read:విశాఖ వేదికగా ‘CII సదస్సు’-2026

శేఖర్ మాస్టర్ తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ పాటలకు తనదైన శైలిలో నృత్యరీతులు సమకూర్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమాలతో పాటు టెలివిజన్ కార్యక్రమాల ద్వారా కూడా ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం పలు సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

- Advertisement -