నాలుగోసారి ప్రధానిగా బంగ్లా ఉక్కు మహిళ..

257
- Advertisement -

బంగ్లాదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ ఘన విజయం సాధించింది. దీంతో షేక్ హసీనా నాలుగో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. పార్లమెంట్‌లోని 300 స్థానాలకు గాను అవామీ లీగ్ నేతృత్వంలోని మహా కూటమి 288 సీట్లను గెలుచుకుందని ఎన్నికల సంఘం కార్యదర్శి హిలాలుద్దీన్ అహ్మద్ ప్రకటించారు.

అలాగే ప్రతిపక్ష పార్టీయైన జాతీయ ఐక్య ఫ్రంట్ (ఎన్‌యూఎఫ్) 15 శాతం ఓట్లతో కేవలం ఏడు సీట్లలో గెలుపొందిందని చెప్పారు. ఇతరులు మూడు స్థానాలను గెలుచుకున్నారని తెలిపారు. హింసాయుత వాతావరణంలో ఆదివారం ఎన్నికలు జరుగగా, ఓట్ల లెక్కింపు సోమవారం మధ్యాహ్నానికి పూర్తయ్యిందని పేర్కొన్నారు.

Bangladesh PM

 

ఇదిలా ఉంటే ప్రధాన ప్రతిపక్ష నేతలు మాత్రం ఎన్నికలు మళ్లీ నిర్వహించాలనే డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. ఈ ఎన్నికల్లో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని ఇందులో 18 మంది మృతి చెందగా 200 మందికి తీవ్రగాయాలయ్యాయని వారు అన్నారు. ఇప్పటి వరకు బంగ్లాదేశ్ చరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ జరగలేదని ప్రధాన ప్రతిపక్షం వ్యాఖ్యానించింది. ఇక ఈ విజయంతో నాలుగోసారి బంగ్లా ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు 71 ఏండ్ల షేక్ హసీనా.

- Advertisement -