ధోని రాముడు, కోహ్లి ల‌క్ష్మ‌ణుడుః ధావ‌న్

264
virat-kohli-shikhar-dhawan-ms-dhoni
- Advertisement -

భార‌త క్రికెట్ లో అద్భ‌తమైత‌న ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ శిఖ‌ర్ దావన్. నిత్యం సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు ధావ‌న్. తాజాగా ధావ‌న్ ఒక సాంగ్ పాడాడు. ఇప్పుడు ఆసాంగ్ సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ప్ర‌స్తుతం ఇండియా ప్లేయ‌ర్లు ఐర్లాండ్ టూర్ లో ప‌ర్య‌టిస్తోన్నారు. నిన్న సాయంత్రం విమానంలో ఐర్లాండ్ బ‌యల్దేరి వెళ్లారు.

dhoni, kohli, dhawan

ఈసంద‌ర్భంగా ఐర్లాండ్ లో రెండు ట్వీ20 మ్యాచ్ ల‌ను ఆడ‌నున్నారు. ఐర్లాండ్ కు వెళ్తున్న స‌మ‌యంలో విమానంలో ధావ‌న్ ఓ సాంగ్ పాడి అంద‌రిని మైమ‌రిపించాడు. ఇక విమానంలో ధావ‌న్ కోహ్లి, ధోని మ‌ధ్య‌లో కూర్చున్నాడు. విమానంలో స‌రదాగా ఎంజాయ్ చేశారు ప్లేయ‌ర్లు. ఇక దావ‌న్ పాడిన సాంగ్ లో ధోనిని రాముడితో, కోహ్లిని ల‌క్ష్మ‌ణుడితో పోల్చాడు ధావ‌న్.

kohli, dhawan

ఇండియా క్రికెట్ టీంకు వీరిద్ద‌రూ ఎంతో ముఖ్య‌మైన వార‌ని అందుకే వారిద్ద‌ని రామ ల‌క్ష్మ‌ణుల‌తో పోల్చాన‌ని వీడియో ద్వారా తెలిపాడు ధావ‌న్. దింతో ఆవీడియో చూసిన క్రికెట్ అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తోన్నారు. ఈ నెల 27, 29న భారత్‌ ఆతిథ్య ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అనంతరం అక్కడి నుంచి ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది.

 

- Advertisement -