అందరికి నచ్చే ‘లవర్‌’ రాజ్‌ తరుణ్‌

298
Raj Tharun Lover
- Advertisement -

ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన హీరో రాజ్ తరుణ్. ఎంట్రీ సినిమాతోనే అదరగొట్టిన రాజ్‌ తరుణ్‌ తర్వాత సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ లాంటి వరుస విజయాలతో అలరించాడు. అయితే తర్వాత రంగులరాట్నం,రాజుగాడు,అందగాడు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలని లవర్‌గా ప్రేక్షకుల ముందుకువస్తున్నాడు.

అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ‘దిల్‌’ రాజు నిర్మించారు. ఈ సినిమా ఆడియో రిలీజ్‌ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ కంటెంట్‌ని నమ్మి ఇంతదూరం వచ్చామని సినిమా హిట్ అవుతుందని తెలిపారు. రాజ్‌ తరుణ్ ఫ్లాప్‌లో ఉన్న ఫస్ట్ లుక్ ట్రెండ్ అయిందంటే మా బ్యానర్‌కు ఉన్న వాల్యుకు నిదర్శనమన్నారు.

నన్ను భరించి సినిమా తీసినందుకు అనీష్‌కి థ్యాంక్స్ చెప్పారు హీరో రాజ్‌ తరుణ్. మ్యూజిక్ బాగుందని మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు.అలా ఎలా చూసి సినిమా చేద్దామని దిల్ రాజు తనకు చెప్పారని కేవలం 20 నిమిషాలు మాత్రమే కథ విని ఓకే చెప్పారన్నారు.

- Advertisement -