వాళ్ల వ‌ల్లే మ్యాచ్ ఓడిపోయాంః కోహ్లి

203
kohli

ఇంగ్లాండ్ తో జ‌ర‌గుతున్న వ‌న్డే మ్యాచ్ లో ఇండియా రెండ‌వ మ్యాచ్ లో ఓట‌మి పాల‌య్యిన విష‌యం తెలిసిందే. 86ప‌రుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో భార‌త్ ఓట‌మిపాలయ్యింది. త‌మ అద్బుతమై బ్యాటింగ్, బౌలింగ్ తో భార‌త ఆట‌గాళ్ల‌ను క‌ట్ట‌డి చేశారు ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు. మొద‌టి మ్యాచ్ తో మంచి ఆరంభాన్ని ఇచ్చిన కోహ్లి సేన రెండ‌వ మ్యాచ్ లో అంత‌గా ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయారు. భారీ ల‌క్ష్యఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన ఇండియా బ్యాట్స్ మెన్లు మొద‌ట్లో బాగానే ఆడిన ఆ త‌ర్వాత ఇంగ్లాండ్ బౌల‌ర్ల దాటికి వెనుదిరిగారు.

india

ఈసంద‌ర్భంగా మ్యాచ్ జరిగిన అనంత‌రం మీడియాతో మాట్లాడాడు కెప్టెన్ విరాట్ కోహ్లి. ఇండియా ఓడిపోవ‌డానికి కార‌ణం ఆ ఇద్ద‌రు బౌల‌ర్లే అని చెప్పాడు. వాళ్లిద్ద‌రూ అద్భుతంగా బౌలింగ్ చేయ‌డం వ‌ల్లే త‌మ జ‌ట్టు ఓడిపోయింద‌న్నారు. ఇంగ్లండ్ బౌల‌ర్లు మోయిన్ అలీ, ర‌షీద్ అద్భుతంగా బౌలింగ్ చేశార‌న్నారు. వారిద్ద‌రిలో ఎ ఒక్క‌రూ విఫ‌ల‌మైన తాము గెలిచే వాళ్ల‌మ‌న్నారు.

Moeen-Adil

భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన త‌మ జట్టు మొద‌ట్లోబానే ఆడినా వ‌రుస‌గా మూడు వికెట్లు ప‌డ‌టంతో డిప్రెష‌న్ కు గుర‌య్యామ‌న్నారు. కొత్త ఆట‌గాళ్ల‌న‌ను ప‌రిశీలిస్తుండ‌టం వ‌ల్ల విజ‌యావ‌కాశాల‌ను కోల్పోయామ‌న్నారు. ఆలీ, ఆషిద్ లు బౌలింగ్ చేస్తుంటే త‌మ బ్యాట్స్ మెన్ల‌కు ఒత్తిడి పెరిగింద‌న్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కూ ఇద్ద‌రూ చెరోక మ్యాచ్ గెల‌వ‌గా ఎల్లుండి జ‌రిగే మూడ‌వ మ్యాచ్ ఇరుజ‌ట్లు తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. టీ20 సిరీస్ ఇండియా గెలుచుకోగా వ‌న్డే సిరీస్ ఎవ‌రూ కైవ‌సం చేసుకుంటారో చూడాలి.