ఆమెకి కాలింది…ఆయన ఆడీని ముంచింది

205
- Advertisement -

రష్యాకి చెందిన గాయ్ జెంటిల్‌ అనే 41 ఏళ్ల వ్యక్తి బ్యాంకు ఉద్యోగి. ఇతనికి కొద్ది రోజుల క్రితం క్రిస్టినా అనే మోడల్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నారు.

గాయ్ జెంటిల్ బ్యాంక్‌ ఉద్యోగి కాబట్టి క్రిస్టినాకు వ్యాపారం ప్రారంభించడానికి లోన్ ఇప్పిస్తానని చెప్పాడు. గత వారం ఇద్దరూ డిన్నర్‌ కోసం ఓ హోటల్‌కు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో తెలీదు కానీ  గాయ్‌.. క్రిస్టినాను హోటల్‌ దగ్గరే వదిలేసి వెళ్లిపోయాడు. దాంతో అతనిపై పగ తీర్చుకోవాలనుకుంది.

                    She Drives Into A Swimming Pool

అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలన్న ఉద్దేశ్యంతో క్రిస్టినా అతడి మెర్సిడెజ్ బెంజ్ కారు తాళాల‌ను తీసుకెళ్లింది. బ‌య‌ట స్విమ్మింగ్ పూల్ ద‌గ్గ‌ర ఉన్న ల‌క్ష డాల‌ర్ల విలువైన‌ మెర్సిడెజ్  కారును ఈత‌కొల‌నులోకి తోసేసి `బ‌య‌ట నీకోసం స‌ర్‌ప్రైజ్ ఎదురుచూస్తుంది… వెళ్లి చూసుకో` అని గైకి మెసేజ్ చేసింది. బయటకు వచ్చి చూడగా కారు నీటిలో దర్శనం ఇచ్చింది.

She Drives Into A Swimming Pool

ఆమె  ఇలా చేస్తుంద‌ని అనుకోలేద‌ని, త‌న‌ను పెళ్లి కూడా చేసుకోవాల‌నుకున్నాన‌ని, ఆమె ఇలా చేయ‌డంతో ఆ ఆలోచ‌న మానుకున్న‌ట్లు గై వెల్ల‌డించాడు. ఇక టోయింగ్ వాళ్ళను పిలిపించి  కారును బయటకు తీయించాడు.

- Advertisement -