ఫ్యాన్‌తో కాజల్‌ డేటింగ్..

107
Kajal To Date A Fan

తమిళంలో విజయ్‌తో కలిసి నటించిన ‘మెర్సల్’ మూవీ ఈనెల 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ మూవీలో నటించిన కాజల్ ఫేస్ బుక్‌ లైవ్‌లో అభిమానులతో

ముచ్చటించారు. ఈ మూవీని తెలుగులో ‘అదిరింది’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘మెర్సల్’ మూవీ ముచ్చట్లతో పాటు పర్సనల్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది అందాల చందమామ కాజల్.

 Kajal To Date A Fan

మెర్సల్ మూవీ తన కెరియర్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ అని విజయ్‌తో మూడోసారి కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు కాజల్. తాను నటించిన చిత్రాల్లో ‘మెర్సల్’ కథ చాలా గొప్పదని.. ఈ మూవీలో వైద్యురాలి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా కాజల్.. ఫ్యాన్స్ అడిగిన వివిధ ఆసక్తికర మైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ లైవ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే 20 లక్షమంది చూశారు. కాజల్ ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే.. ‘ఈ సినిమాలో డాక్టర్ పాత్ర పోషిస్తున్నాను.. ఇందులో సమంతతో కలిసి నటించడం చక్కని అనుభూతినిచ్చింది.

ఖైదీ నం 150, నేనే రాజు నేనే మంత్రి మూవీల్లోనూ పాత్రలూ నాకు బాగా నచ్చాయి… నా అందం వెనుక ఉన్న రహస్యం ఏంటంటే.. పాజిటివ్‌గా స్పందించడం.. కంటినిండా నిద్రపోతాను.. నీళ్లు బాగా తాగుతాను.. పళ్లు, కూరగాయలను కూడా బాగానే మెక్కుతాను.. పిజ్జాలంటే బోల్డు ఇష్టం.

ముప్పూటలా వాటిని తినేస్తా..ఎవరైనా అభిమాని.. నాతో డేటింగ్ కు వస్తావా అని అడిగితే తప్పకుండా వెళ్తాను.. అయితే దానికి చాలా షరతులు వర్తిస్తాయి.. డేటింగ్‌ పూర్తిగా నా ఇష్టప్రకారమే ఉండాలి. అయితే ఆ డేటింగ్ చేసేది ఎవరు? ఎప్పుడు? అన్నది చెప్పను.. ఇక పెళ్లి సంగతి.. తప్పకుండా మీతో చెప్పే చేసుకుంటాను.. ’’