శవాసనం వేస్తే ఎమౌతుందో తెలుసా !

78
- Advertisement -

యోగాసనాలలో శవాసనం అత్యంత ముఖ్యమైనది ఎంతో సులువైనది కూడా. ఈ ఆసనం వేయడం వల్ల శరీర భాగాలన్నిటికి విశ్రాంతి కలుగుతుంది. అందుకే ఈ ఆసనాన్ని విశ్రాంతి ఆసనం అని కూడా అంటారు. ప్రతిరోజూ యోగా చేసిన తరువాత గాని లేదా యోగా మద్యలో గాని ఈ శవాసనం వేయవచ్చు. కేవలం ఉదయం యోగాసనాల తరువాత మాత్రమే కాకుండా రాత్రి పడుకునే ముందు భోజనం చేసిన తరువాత కూడా ఈ శవాసనం వేయవచ్చు. ఈ ఆసనం క్రమం తప్పకుండా వేయడం వల్ల శరీరానికి, మనసుకు పూర్తి విశ్రాంతి లభిస్తుంది. మనసు కేంద్రీకరణ స్థాయి పెరుగుతుంది. జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. ఈ ఆసనం వేయడం వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెరిగి అవి శరీర భాగాలకు రక్త ప్రసరణ సమృద్దిగా జరుగుతుంది. నిద్రలేమి, అధిక రక్తపోటు లేదా తక్కువ రక్తపోటు వంటి సమస్యలను దూరం చేస్తుంది. హృదయ సంబంధిత సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు, అలసట వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా శవాసనం వేస్తే కోపం అదుపులోకి వచ్చి.. ఆలోచన స్థాయి మెరుగుపడుతుంది.

శవాసనం వేయు విధానం

ముందుగా నేలపై లేదా యోగా షీట్ పై వెల్లకిల పడుకోవాలి. ఆ తరువాత రెండు కాళ్ల మద్య ఒకటి లేదా రెండు అడుగుల వెడల్పు ఉండేలా చూసుకొని, కాలి బొటనవేళ్లు పైకి చూస్తున్నట్లుగా ఉంచాలి. ఈ సమయంలో మడమలు రెండు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండేలా చూసుకోవాలి. రెండు చేతులు శరీరానికి కొంచెం దూరంలో ఉంచి అరచేతులు పైకి కనిపించేలా ఉంచాలి. ఆ తరువాత మెడను అనుకూలమైన స్థితిలోకి వాల్చి కళ్ళు మూసుకొని దృష్టి శ్వాసపై కేంద్రీకరించాలి. ఏ ఆలోచనలు చేయకుండా కేవలం శరీరాన్ని గమనిస్తూ శ్వాస నెమ్మదిగా సాగిస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.

ఇవి కూడా చదవండి…

గోధుమగడ్డి రసం తాగితే ఎన్నో ప్రయోజనాలో!

రాగిపాత్రలతో ఆరోగ్యం..

నిలబడి నీళ్లు తాగుతున్నారా..అయితే?

- Advertisement -