మోదీ గడ్డంతో కొత్త ఇంగ్లీష్ పదం..!

282
shashi
- Advertisement -

బెంగాల్ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గడ్డంపై సెటైర్లు వినిపించిన సంగతి తెలిసిందే. గడ్డం పెంచిన వారందరూ రవీంద్రనాథ్ ఠాగూర్ కాలేరని ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలు విమర్శించగా తాజాగా కాంగ్రెస్ ఎంపి శశిథరూర్‌ తనదైన శైలీలో మోదీ గడ్డానికి కొత్త అర్థం చెప్పారు.

ఆంగ్ల ప‌దంతో ప్ర‌ధాని మోదీని టార్గెట్ చేస్తూ పొగొనోట్రోఫీ (Pogonotrophy) అనే ఆంగ్ల ప‌దాన్ని కొత్త‌గా నేర్చుకున్న‌ట్లు తెలిపారు. పొగ‌నోట్రోఫీ అంటే గ‌డ్డాన్ని పెంచ‌డం అన్న‌మాట‌.గ‌త ఏడాదిన్న‌ర కాలం నుంచి మోదీ తెల్ల‌గ‌డ్డంతో ద‌ర్శ‌నం ఇస్తున్నారు. పొగొనోట్రీఫీ అంటే మోదీలా గ‌డ్డాన్ని సాగు చేయ‌డ‌మ‌న్న ఉద్దేశాన్ని ఎంపీ శ‌శిథ‌రూర్ వినిపించారు. ఈ కొత్త ప‌దాన్ని త‌న మిత్రుడు రితిన్ రాయ్ అనే ఆర్థిక‌వేత్త నేర్పిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

- Advertisement -