ఇటీవల తిరుపతిలో అక్టోబర్ 2న ప్రారంభమైన శ్రీకారం షూటింగ్ తాజాగా పూర్తి అయ్యింది. షూటింగ్‌లో సహకరించిన అందరూ ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ కు చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో షూటింగ్ అనుకున్న షెడ్యూల్లో పూర్తి అయ్యింది. శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్, నరేష్, రావు రమేష్, సాయి కుమార్, సత్య, సప్తగిరి, ఆమని ఈ షెడ్యూల్లో పాల్గొన్నారు. టాకీ పార్ట్‌తో పాటు దినేష్ మాస్టర్ నేతృత్వంలో ఒక సాంగ్ చిత్రీకరణ జరిగింది. ఈ కరోనా సమయంలో అందరి సహకారంతో షూటింగ్ ఎటువంటి అవాంతరాలు లేకుండా జరిగింది.
శర్వానంద్‌తో జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోన్న ఈ సినిమాను కిషోర్.బి దర్శకత్వం వహిస్తుండగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై గోపి ఆచంట, రామ్ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బ్లాక్ బాస్టర్ గద్దలకొండ గణేష్ తరువాత 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లో వస్తోన్న రెండో సినిమా శ్రీకారం. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్ర సంభాషణలు అందిస్తున్నారు. జె.యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీకి అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్.
నటీనటులు:శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్, రావ్ రమేష్, ఆమని, నరేష్, సాయి కుమార్, మురళి శర్మ, సత్య, సప్తగిరి తదితరులు
సాంకేతిక నిపుణులు:
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
డైరెక్టర్: కిషోర్.బి
మ్యూజిక్: మిక్కీ జె మేయర్
కెమెరామెన్: జె.యువరాజ్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర
ఆర్ట్: అవినాష్ కొల్ల
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్ట