హీరో శ్రీకాంత్‌కు జోడిగా శృతి..

138
hero srikanth

హరిప్రియ మూవీస్ బ్యానర్ పై, మల్టీ కలర్ ఫ్రేమ్స్ సమర్పణలో డాక్టర్ కుంచపురమేష్ నిర్మాతగా, వెంకటేష్ రెబ్బ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మరణమృదంగం. ఇటీవల లాంఛనంగా ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుండి ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ కుంచపు రమేష్ మాట్లాడుతూ… మరణమృదంగం చిత్రంలో హీరో శ్రీకాంత్ కు జోడిగా హిరోయిన్ (పటాస్ ఫేమ్) శృతిశోది ఖరారు అయ్యింది. శ్రీకాంత్ యాక్షన్ రివేంజ్ పాత్రలో కనిపించబోతున్న ఈ మూవీ నవంబర్‌లో సెట్స్ మీదకు వెళ్లబోతొంది. ఇదొక మంచి కథ, శ్రీకాంత్ కు బాగా సెట్ అయ్యే కథ ఇది, ఈ సినిమాతో శ్రీకాంత్ కు మంచి బ్రేక్ లభిస్తుంది. ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్లు దర్శకుడు వెంకటేష్ రెబ్బ ఈ సినిమాను తీస్తున్నారు. మేము ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా మంచి టెక్నీషియన్స్ తో తెరకెక్కిస్తున్నాము అన్నారు.

నటీనటులు:
శ్రీకాంత్
శృతిశోది

సాంకేతిక నిపుణులు:
నిర్మాత: డాక్టర్ కుంచపురమేష్
సహానిర్మాతలు: మధు రెబ్బ, కుంచపు అరుణ
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
కెమెరామెన్: చిట్టిబాబు
ఫైట్స్: పి.సతీష్
సంగీతం: మంత్ర ఆనంద్
కథ, మాటలు: డి.తులసీ దాస్
దర్శకత్వం: వెంకటేష్ రెబ్బ
పిఆరోఒ: వంశీ శేఖర్