శర్వానంద్‌కు ఎంత పెద్ద కుటుంబమో..!

176
sharwanand-new-movie-shatamanam-bhavati-
sharwanand-new-movie-shatamanam-bhavati-
- Advertisement -

శర్వానంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘శతమానం భవతి’. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. సతీష్‌ వేగేశ్న దర్శకుడు. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మాతలు. ప్రస్తుతం అమలాపురంలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ నెల 18తో టాకీభాగం పూర్తవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ తాతా మనవళ్ల మధ్య వుండే అనుబంధాన్ని, ఆప్యాయతల్ని తెలిపే అందమైన కుటుంబ కథాచిత్రమిది. ఇదొక అనుబంధాల హరివిల్లు. మా సంస్థకు బొమ్మరిల్లు చిత్రం ఎంతటి పేరు తెచ్చిపెట్టిందో అదే స్థాయి పేరుని శతమానం భవతి తెచ్చిపెడుతుందన్న నమ్మకముంది. మూడు తరాలకు సంబంధించిన కథ ఇది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా అమలాపురంలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ నెల 18 వరకు జరిగే చిత్రీకరణతో టాకీ పార్ట్ పూర్తవుతుంది.

Sarvanand

ఇదే నెల 28తో పాటల చిత్రీకరణ పూర్తిచేసుకుని చిత్ర బృందం హైదరాబాద్ చేరుకుంటుంది. డిసెంబర్‌లో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసి చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాంఅన్నారు. ప్రకాష్‌రాజ్, జయసుధ, ఇంద్రజ, శివాజీరాజా, ప్రవీణ్, సిజ్జు, శ్రీరాం, మధురిమ, నీల్యా, ప్రమోదిని, మహేష్, భద్రం, హిమజ, ప్రభు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, సంగీతం: మిక్కీ జె.మేయర్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కూర్పు: మధు, ఆర్ట్: రమణ వంక, నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, కథ, కథనం, మాటలు,దర్శకత్వం: వేగేశ్న సతీష్.

- Advertisement -