ఎలక్షన్స్ కు షర్మిల గుడ్ బై.. ఆ భయంతోనే!

44
- Advertisement -

తెలంగాణ ఎన్నికల వేళ వైస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని, ఎలక్షన్ రేస్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఆమె అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాల పట్ల రాజకీయ విశ్లేషకులు రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఆమె పార్టీ వ్యవహారంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటూ వచ్చాయి. మొదట ఒంటరిగానే ఆమె బరిలో దిగాలని భావించినప్పటికి ఆ తరువాత కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్దమైంది. అయితే హస్తం పార్టీ మొదట షర్మిల రాకను స్వాగతించినప్పటికి ఆ తరువాత పట్టించుకోలేదు. .

దాంతో మళ్ళీ ఎలక్షన్ బరిలో ఒంటరిగా నిలిచేందుకు సిద్దమయ్యారు. పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు షర్మిల. కానీ తాజాగా పూర్తిగా ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మద్యనే ప్రధానపోరు నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజల దృష్ఠి కూడా ఈ మూడు పార్టీలపైనే ఉంది. దాంతో ఎన్నికల్లో పోటీ చేసిన ఓటమి తప్పదనే భయంతోనే షర్మిలా ఆ నిర్ణయం తీసుకున్నట్లు కొందరి వాదన.

ఇక తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన పాలేరు నియోజిక వర్గం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తరుపున బరిలో ఉన్నారు. ఆయనకు వైఎస్ఆర్ కుటుంబానికి మద్య మంచి సన్నిహిత్యం ఉంది. దాంతో పొంగులేటికి పోటీగా బరిలోకి దిగడం ఇష్టంలేక షర్మిల ఎలక్షన్స్ కు దూరమైనట్లు తెలుస్తోంది. అయితే మొత్తం మీద వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపే అవకాశం లేదని, ఒకవేళ పోటీ చేయడం వల్ల డిపాజిట్లు కూడా దక్కకపోతే.. తన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందనే భయంతోనే ఆమె కాంగ్రెస్ కు జై కొట్టినట్లు కొందరి అభిప్రాయం.

Also Read:CM KCR:ముగిసిన రాజశ్యామల యాగం

- Advertisement -