గ్రీన్ ఛాలెంజ్…గొప్ప కార్యక్రమం:శారదా పీఠం

943
sharada peetam
- Advertisement -

ప్రస్తుత కాలంలో జీవరాశులను రక్షించుకోవాలన్న, మానవజాతి మనుగడను కొనసాగించాలన్న పచ్చదనంతో కూడిన కాలుష్య రహిత వాతావరణం చాలా అవసరం. దానికి అనుగుణంగా రాజ్యసభసభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ అనే గొప్ప కార్యక్రమం ఎంతోమందిని ఆకర్షితులను చేస్తోందని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి తెలియజేశారు.

విశాఖ శ్రీ శారదాపీఠం ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునివ్వడంతో పాటు స్వరూపానందేంద్ర సరస్వతీ జన్మదినోత్సవం సందర్భముగా పీఠప్రాంగణంలో మూడు రుద్రాక్ష మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సమాజంలో ఎన్నో పక్షులు, మరెన్నో జీవరాశులు అంతరించిపోవడానికి ముఖ్యకారణము వాయు కాలుష్యము, వాతావరణ సమతుల్యత లేకపోవడం వాటి ద్వారా రాబోయే కాలానికి ఎంతో ఉపద్రవం పొంచి ఉందన్నారు.

పాఠ్యపుస్తకాలలో పక్షులను గూర్చి తెలుసుకోవడానికే పరిమితమువుతున్న ప్రస్తుత తరుణంలో గ్రీన్ చాలెంజ్ అనే వినూత్న కార్యక్రమం ఎంతో మమ్ములను విశేషం ఆకర్షించినది అని ఉత్తరాధికారి తెలిపారు. దీనిని కొనసాగించాలన్న సద్దుదేశంతో టి.టి.డి చైర్మన్ వై.వి.సుబ్బరెడ్డికి, తమిళనాడుకు చెందిన దినమాలర్ పత్రికాధినేత ఆర్.ఆర్. గోపాల్‌కి, విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ కి, జి. హెచ్.ఎం.సి జోనల్ కమిషనర్ హరిచందనా మరియు ప్రముఖ వ్యాపారవేత్త క్రిమ్ స్టోన్ అధినేత విరేన్ షాకి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ఈ చాలెంజ్ ను ప్రతి ఒక్కరు బాధ్యతయుతంగా స్వీకరించి పచ్చదనంతో కూడిన నిండుతన్నాని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -