భారత్‌లో కొత్త పుతిన్..మోడీపై పవార్ ఫైర్!

18
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై నిప్పులు చెరిగారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. భారత్‌లో మరో పుతిన్ తయారవుతున్నాడని మండిపడ్డారు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి పోటీ చేస్తున్న మహా కూటమి నేత వికాస్ (కాంగ్రెస్) తరపున ప్రచారం నిర్వహించారు పవార్.గతంలో దేశాన్ని పాలించిన ప్రధానులు నవభారత్ నిర్మాణం కోసం కృషి చేస్తే…ప్రస్తుత ప్రధాని మోడీ..విపక్ష నేతలపై నిందలు వేయడం,విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు.

బీజేపీ తమ పాలనలో ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు పవర్. ఇక మోడీ ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అనుకరిస్తున్నారని..రాజ్యాంగాన్ని మారుస్తామని కొందరు బీజేపీ నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు పవార్.

అమరావతి ప్రజలకు క్షమాపణ చెప్పేందుకే తాను ఇక్కడకు వచ్చానని పవార్ తెలిపారు. 2019 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి, గెపుపొందిన నవనీత్ కౌర్ (సినీ నటి)కు తాను మద్దతుగా నిలిచానని… ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఇప్పుడు ఇక్కడకు వచ్చానని చెప్పారు.

Also Read:రచయితగా మారిన అల్లరి నరేష్..

- Advertisement -