మహారాష్ట్ర రాజకీయ ధురందురుడు, కురువృద్ధుడు, నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. ముంబాయిలో జరిగిన తన ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పవార్ ఈ ప్రకటన చేశారు. ఈ నిర్ణయాన్ని ఎన్సీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. తన సమీప బంధువు అజిత్ పవార్..ఎన్సీపీని వీడి బీజేపీలో చేరతారనే ఉహాగానాల నడుమ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎన్సీపీకి తదుపరి బాస్ ఎవరనే దానిపై స్పష్టత ఇంకా రాలేదు.
Also Read: బీజేపీ మేనిఫెస్టో.. గట్టెక్కిస్తుందా ?
శరద్‌పవార్ 1940లో బారామతి ప్రాంతంలో జన్మించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆమితాసక్తితో కాంగ్రెస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రి పదవులను ఆలంకరించారు. 1999లో కాంగ్రెస్‌ను వీడి నేషనలిస్ట కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న శరద్…2017లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్‌తో సత్కరించింది.
Also Read: పాక ఇడ్లీ తిన్న వెంకయ్య..అద్భుతం అంటూ కితాబు