బాలీవుడ్‌లో ఆశ్లీలత ఎక్కువగా కనిపిస్తోందని…చాలా వరకు బాలీవుడ్ సినిమాలు బాయ్‌కట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పఠాన్ సినిమాకు సంబంధించి పెద్ద వివాదమే రాజుకుంది. రాజకీయ సినీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున్న విమర్శలను ఎదుర్కొంటుంది. దీంతో దేశంలోని కొన్ని మత సంఘాలు కూడా ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా బేషరమ్‌రంగ్ సాంగ్ పట్ల తీవ్ర ఆభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
దీపికా పడుకొణే వేసుకున్న కాషాయం రంగు బికినీ వేసుకోవడం అందులో ఒక కారణంగా చెప్పొచ్చు. సినిమాల్లో ఇటువంటి చర్యలను అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్ లక్నోలోని శంకరాచార్య పీఠం సంచలన నిర్ణయం తీసుకుంది. శంకరాచార్య జ్యోతిష్య పీఠాధిపతి స్వామి అవిముక్తేశ్వరనంద్ ధరమ్ సెన్సార్ బోర్డ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
హిందూ దర్మాన్ని కించపరిచేలా చిత్రాలను చిత్రీకరిస్తే సెన్సార్ బోర్డ్ కత్తెర్లు వేయక తప్పదంటున్నారు. ఇక సినిమాలే గాకుండా వెబ్ సిరీస్‌లో కూడా రిలీజ్ కు ముందు సెన్సార్ పనులు పూర్తి చేసుకోవాలని అంటున్నారు. ఈనెల 15న ఢిల్లీలో ధరమ్ సెన్సార్ బోర్డు కార్యాలయంను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఉత్తరాది సినిమాలకే గాకుండా దక్షిణాది సినిమాలపై కూడా సెన్సార్ చేస్తామని ఇందుకోసం దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ బోర్డు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
ధరమ్ సెన్సార్ బోర్డ్ గైడ్ లైన్స్‌ను జనవరి 19న ప్రకటిస్తామన్నారు. ధరమ్ బోర్డులో సుప్రీం కోర్ట్ సీనియర్ లాయర్ PN మిశ్రా, సనాతన ధర్మ ప్రచారకర్త స్వామి చక్రపాణి, యూపీ ఫిల్మ్ డెవల్‌మెంట్ కార్పోరేషన్ వైస్ ప్రెసిడెంట్ తరుణ్ రాఠీతో పాటు మొత్తం 10 మంది సభ్యులు ఈ బోర్డులో ఉండబోతున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి…