ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 148 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన బెంగళూరు కెప్పెన్ షేన్ వాట్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో నిరాశపర్చిన స్టార్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ స్ధానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ తుది జట్టులోకి వచ్చాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీకి తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ వాట్సన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. తర్వాత విష్ణు వినోద్ (7) , కేదార్ జాదవ్ (1) కూడా నిరాశ పర్చడంతో 22 పరుగులకే మూడు వికెట్లు బెంగళూరు కష్టాల్లో చిక్కుకుంది.ఈ దశలో డివిలియర్స్ జట్టు స్కోరును ముందుకు నడిపించే బాధ్యతలను భుజాన ఎత్తుకున్నాడు.
తొలుత నెమ్మదిగా ఆడిన ఏబీ.. తర్వాత రెచ్చిపోయాడు. ఆకాశమే హద్దుగా చేలరేగిన ఏబీ తన మార్క్ ఆటతో సిక్సర్లు, ఫోర్లతో విరుచుకపడ్డాడు. ఏబీడీ 46 బంతుల్లో 3 ఫోర్లు,9 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేయగా మన్ దీప్ సింగ్ 28, బిన్నీ 18 పరుగులు చేశారు. తొలి 15 ఓవర్లలో కేవలం 71 పరుగులు మాత్రమే చేసిన ఆర్సీబీ….డివిలియర్స్ ధాటికి చివరి 5 ఓవర్లలో 77 పరుగులు చేసింది. దీంతో నిర్ణీత ఓవర్లలో బెంగళూరు 4 వికెట్లు కొల్పోయి 148 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అరోన్ 2,అక్షర్ పటేల్,సందీప్ శర్మ తలో ఒక వికెట్ తీశారు.