రాజా ఎప్పటికే నా బెస్ట్ ఫ్రెండే…

165
SPB requests fans on Ilayaraja's legal notice

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా లీగల్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరుగుతున్న ప్రచారాలకు ఎస్పీబీ చెక్ పెట్టారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన బాల సుబ్రమణ్యం నేను, ఇళయరాజా ఇప్పటికీ మంచి మిత్రులమేనని స్పష్టం చేశౄరు.. సినిమా రంగంలోకి ప్రవేశించకముందు నుంచే మేమిద్దరం స్నేహితులం. ఇళయరాజా కంపోజ్‌ చేసిన పాటలను పాడేందుకే నేను పుట్టానని అందరూ అంటుంటారని తెలిపారు.

ఆయన పంపిన లీగల్‌ నోటీస్‌ వల్ల నేను చాలా కలత చెందాను. అయినా వరల్డ్‌ టూర్‌ కొనసాగుతుంది. అదృష్టవశాత్తూ ఇతర సంగీత దర్శకులు కంపోజ్‌ చేసిన ఎన్నో హిట్‌ సాంగ్‌లను నేను పాడాను. అయినా ప్రేక్షకుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు అని తెలిపారు.

నాకూ ఆత్మాభిమానం ఉంది. ఇళయరాజా కానీ ఆయన ఆఫీస్‌ నుంచి ఎవరైనా సరే పాటలు పాడవద్దని నాకు సమాచారం ఇస్తే బాగుండేది. ఒక్క ఫోన్‌కాల్‌ ద్వారా సమస్య అక్కడే పరిష్కారమైపోయేది. సినిమా రంగంలోకి ప్రవేశించకముందు నుంచే మేమిద్దరం స్నేహితులం. మేం మాత్రమే కాదు. ఇళయరాజా కంపోజ్‌ చేసిన పాటలను పాడేందుకే నేను పుట్టానని అందరూ అంటుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇళయరాజా గొప్ప జ్ఞాని. నేనో గొప్ప సంగీత దర్శకుడితో పనిచేశా. మా ఇద్దరి మధ్య విరుద్ధ భావాలు లేవు. కాలమే సమస్యకు పరిష్కారం చూపుతుంది’ అని పేర్కొన్నారు.