- Advertisement -
ఆర్బీఐ గవర్నర్‌గా మరో మూడేళ్ల పాటు శక్తికాంత దాస్‌నే కొనసాగించాలనే కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది డిసెంబర్ 10తో ఆయన పదవీకాలం ముగియనుండగా శక్తికాంత దాస్ పునర్‌నియామకాన్ని కేబినెట్ పునర్నియామక కమిటీ ఆమోదించింది. ఆయనను కొనసాగించాలనే ఆలోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం.. మరో మూడేళ్లపాటు లేదా కేంద్రం ఇచ్చే తదుపరి ఆదేశాల వరకు ఆయననే ఆర్బీఐ గవర్నర్ పదవిలో కొనసాగనున్నారు.
2018లో ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసిన తర్వాత.. ఆ బాధ్యతలను స్వీకరించారు శక్తికాంత దాస్.. ఓవైపు కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్న సమయంలోనూ.. సంక్షోభం తలత్తెకుండా దాస్ ఆ సమస్యను పరిష్కరించేందుకు కీలక చర్యలు చేపట్టారు.లోన్ మారటోరియం మంచి ఫలితాలను ఇచ్చింది.
- Advertisement -