ఖిలాడీ..దివాళి ట్రీట్

144
Ravi Teja
- Advertisement -

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ఖిలాడి షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన‘ఇష్టం’ అనే మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా దీపావళి కానుకగా సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్‌. ఇందులో రవి తేజ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తుండగా, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఉన్నీయును ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

తొలుత ఈ సినిమాను 2021 మే 28న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా అన్ని సినిమాల్లాగే “ఖిలాడీ” వాయిదా పడింది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

- Advertisement -