షారుక్ కి తృటిలో తప్పిన ప్రమాదం

241
Shah Rukh Khan escapes accident on the sets of Aanand
- Advertisement -

సినిమా చిత్రీకరణలో అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి..తెలిసీ తెలియక జరిగే ఈ ప్రమాదాలలో ప్రాణాలు పోతాయి కూడా. అయితే తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ఖాన్‌ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.  ఆనంద్ ఎల్ రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా షూటింగ్‌ ముంబై ఫిలిం సిటీలో జరుగుతుండగా సెట్‌ పై భాగం(రూఫ్‌) ఒక్కసారిగా కుప్పకూలింది.
580169-577504-shah-rukh
షారుక్ కూర్చున్న సీటు ద‌గ్గ‌ర్లోనే శకలాలు పడిపోవడంతో అంతా ఆందోళన చెందారు. ఈ ప్రమాదంలో షారుక్ ఎలాంటి గాయాలు లేకుండా బ‌య‌ట‌ప‌డ్డాడు. షారుక్ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ‌టంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  కానీ ఈ ప్రమాదంలో ఇద్ద‌రు సిబ్బందికి గాయాలయ్యాయి.
 Shah Rukh Khan escapes accident on the sets of Aanand
ఆదివారం చోటుచేసుకున్న ఈ సంఘటనను ముంబై మిర్రర్‌ వెలుగులోకి తెచ్చింది. షూటింగ్‌లో జరిగిన ప్రమాదం కారణంగా రెండు రోజుల పాటు షూటింగ్‌ను నిలిపేశారు చిత్రటీం. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు.

షారుక్‌ స‌ర‌స‌న అనుష్క‌శ‌ర్మ‌, క‌త్రినా కైఫ్‌లు నటిస్తున్నారు. షారుక్ మ‌రుగుజ్జుగా, అనుష్క మాన‌సిక రోగిగా కనిపించబోతున్నట్లు సమాచారం. జ‌బ్ త‌క్ హై జాన్ త‌ర్వాత ఈ ముగ్గురూ క‌లిసి న‌టిస్తున్న రెండో సినిమా ఇది.

- Advertisement -