OU పేపర్ కరెక్షన్‌లో అవకతవకలు

8
- Advertisement -

ఓయూ పేపర్ కరెక్షన్‌లో తీవ్ర తప్పిదాలు బయటపడ్డాయి. రీవాల్యుయేషన్ ఫీజు కోసం కావాలనే ఫెయిల్ చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవల జరిగిన ఎల్ఎల్‌బీ సెమిస్టర్ పరీక్షలో 1500 మంది విద్యార్థులను ఫెయిల్ చేసింది సిబ్బంది.

గతంలో జరిగిన పరీక్షల్లో ఏ– గ్రేడ్ సాధించి ఈ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో, అనుమానం వచ్చి రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు విద్యార్థులు. అయితే రీవాల్యుయేషన్ కోసం రూ.700 చెల్లించిన 1000 మంది విద్యార్థులు పాస్ అవ్వడం, అందులో 8 మందికి 1st గ్రేడ్ మార్కులు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు.

పరీక్షలు జరిగిన 40 రోజుల్లోగా ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా ఫిబ్రవరి నెలలో పరీక్షలు రాస్తే ఏప్రిల్ నెలలో ఫలితాలు విడుదల చేయడం కూడా పలు అనుమానాలకు దారి తీస్తుందని విద్యార్థులు ఆరోపించారు. మరోవైపు మార్చి మొదటి వారంలో జరిగిన జర్నలిజం సెమిస్టర్ పరీక్షల ఫలితాలు కూడా ఇంతవరకు విడుదల కాలేదని తెలిపారు విద్యార్థులు.

Also Read:టీమిండియాకు భారీ షాక్

- Advertisement -