బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగానే పెద్ద ఊరట. గత కొన్ని రోజులుగా ఆకాశాన్నంటిన పసిడి ధరలు ఇప్పుడు భారీగా దిగివస్తున్నాయి. బుధవారం ఏకంగా రూ.5,000 పైగా క్షీణించిన గోల్డ్ రేటు.. గురువారం కూడా అదే బాటలో పయనిస్తూ భారీగా పడిపోయింది.
దేశీయంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.2,130 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.1,950 మేర క్షీణించింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ఔన్సు బంగారం 5 డాలర్లు పెరిగి 4,077 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,640 కి చేరగా….22 క్యారెట్ల ధర రూ.1,33,500 వద్దకు పడిపోయింది. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,45,790 గా ఉండగా, ముంబై, కోల్‌కతా, చెన్నైలలో రూ.1,45,640 వద్ద కొనసాగుతోంది.
బంగారం బాటలోనే వెండి ధరలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. బుధవారం కేజీ వెండిపై రూ.10,000 తగ్గగా గురువారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నైలలో కేజీ వెండి ధర రూ.2,60,000 లుగా ఉండగా ఢిల్లీ, ముంబైలలో రూ.2,50,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
ALso Read:సుప్రీంకు మీనాక్షి నటరాజన్
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మళ్లీ పెరగడం, అమెరికా డాలర్ బలోపేతం కావడం వంటి పరిణామాలు దేశీయంగా ధరల పతనానికి కారణమవుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే జూన్ చివరి నాటికి లేదా జూలైలో తులం బంగారం ధర మరింత తగ్గి, రూ.ಲక్ష మార్కుకు దిగొచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

