‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను మితిమీరిన గ్లామరస్‌గా చూపించడంపై వస్తున్న విమర్శలపై నటి అదా శర్మ స్పందించారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైనప్పటి నుండి ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రను చూపించిన విధానంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది నెటిజన్లు దర్శకుడు బుచ్చిబాబు సన మరియు జానవీ కపూర్‌లను ప్రశ్నిస్తుండగా ఈ విషయంలో బాధ్యత కేవలం ఆమెదే కాదని చిత్రంలోని హీరోకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంటుందని అదా శర్మ అభిప్రాయపడ్డారు.
తాను నటించిన సినిమాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్న అడిగినా సమాధానం చెప్పడానికి నేను ఎప్పుడూ వెనకాడలేదు. ‘ది కేరళ స్టోరీ’ సమయంలో కూడా నేను ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చాను. ఏ భాషా చిత్రంలోనైనా నేను నటించిన సీన్ గురించి నన్ను ప్రశ్నిస్తే, అది నా పాత్ర యొక్క గ్లామర్ లేదా మరేదైనా విషయానికి సంబంధించినదైనా సరే నేను కచ్చితంగా సమాధానం ఇస్తాను అని చెప్పుకొచ్చింది అదా శర్మ.
అయితే నేను ‘పెద్ది’ సినిమాలో నటించలేదు ఇంకా ఆ సినిమాను చూడలేదు కూడా. పైగా సినిమా పరిశ్రమ నేపథ్యం లేని నా సినీ ప్రయాణం…ఇండస్ట్రీ నుండి వచ్చిన వారి ప్రయాణంతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో నా వ్యాఖ్యలు అంత సమంజసం కాకపోవచ్చు అని అభిప్రాయాన్నివ్యక్తం చేసింది.
ఒక సినిమాలో పాత్రల రూపకల్పన బాధ్యత కేవలం మహిళా నటులదే కాదని..హీరోలు దర్శకులు, రచయితలు … చివరికి నకిలీ మీసాలు, విగ్‌లు ఎంపిక చేసే వ్యక్తులపై కూడా ఉంటుందని అన్నారు. ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల దేశం మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తుంది. మార్పు అనేది ఒకేసారి పెద్ద చప్పుళ్లతో రాదు అని అదా శర్మ చెప్పారు.
Also Read: టీమిండియాకు భారీ షాక్

