ఆఫ్ఘనిస్థాన్‌లో కిడ్నాప్‌కి గురైన ఏడుగురు భారతీయులు. ఆఫ్ఘనిస్థాన్‌లోని ఓ విద్యుత్ ప్లాంట్‌లో ఈ ఏడుగురు ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఆ ఏడుగురిని తాలిబన్లు కిడ్పాప్ చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడుగురు ఇంజనీర్లు కిడ్నాప్‌కి గురయ్యారని దృవీకరించిన ఆఫ్ఘాన్ ప్రభుత్వం.
బాగ్లాన్ పోలీసు అధికార ప్రతినిధి జబిహుల్లా షుజా మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్వహణలోని ఓ విద్యుత్ స్టేషన్‌కి ఏడుగురు భారతీయ ఇంజనీర్లు ఓ మినీ బస్సులో వెళ్తుండగా.. కొంత మంది గుర్తుతెలియని సాయుదులు వచ్చి వీరిని కిడ్నాప్ చేశారిని తెలిపారు. ఈ సంఘటనపై భారత ఎంబసీకి చెందిన ఉన్నతాధికారులు ఆరాతీస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దా ఆఫ్ఘనిస్థాన్ బ్రెష్నా షెర్ఖాత్లో ఈ ఏడుగురు భారతీయులు ఇంజనీర్లుగా పనిచేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ ఏడుగురిని కిడ్పాపర్ల చెర నుంచి విడిపించేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.