హైకోర్టు విభ‌జ‌న‌పై నోటిఫికేషన్ విడుద‌ల..

245
high court
- Advertisement -

ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విభజనపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రం విడిపోయ‌న‌ప్ప‌టి నుంచి ఏపీ, తెలంగాణ‌కు ఉమ్మ‌డి హైకోర్టు కొన‌సాతున్న విష‌యం తెలిసిందే. తాజాగా రెండు రాష్ట్రాల‌కు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేయాల‌ని కేంద్ర ప్ర‌భ‌త్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, 2019 జనవరి 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా హైకోర్టులు పనిచేయనున్నాయి. తెలంగాణకు 10 మంది, ఏపీకి 16 మంది న్యాయమూర్తులను కేటాయించారు.

High-Court

మరోవైపు ఉద్యోగుల విభజన చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. దాదాపు 1500 మంది వరకు ఉన్న ఆఫీస్ సబార్డినేట్లు, రికార్డు అసిస్టెంట్లు, బైండర్లు, జమేదార్లు, దఫేదార్లు, బుక్‌బేరర్లు, లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లు, మిషన్ ఆపరేటర్లు తదితరులను రెండు హైకోర్టులకు కేటాయించనున్నారు. వీరి నుంచి ఆప్షన్ల స్వీకరణ కూడా పూర్తయినట్లు స‌మాచారం.

తెలంగాణ‌కు కేటాయించిన 10మంది న్యాయ‌మూర్తుల పేర్లు.. జ‌స్టిస్ పులిగోరు సంజ‌య్ కుమార్, ఎంఎస్ఆర్ఎస్ రామ‌చంద‌ర్ రావు, జ‌స్టిస్ అడ‌వెల్లి రాజ‌శేఖ‌ర్ రెడ్డి, జ‌స్టిస్ పొనుగొంటి న‌వీన్ రావు, జ‌స్టిస్ చ‌ల్లా కోదండ‌రాం చౌద‌రి, జ‌స్టిస్ బులుసు శివ‌శంక‌ర్ రావు, జ‌స్టిస్ డాక్ట‌ర్ ష‌మీమ్ అక్త‌ర్, జ‌స్టిస్ పొట్ల‌ప‌ల్లి కేశ‌వ‌రావు, జ‌స్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జ‌స్టిస్ తొడుపునూరి అమ‌ర్ నాథ్ గౌడ్.

- Advertisement -