కరోనా ఎఫెక్ట్… నాగ్ పూర్ లో 144సెక్షన్

327
Corona Virus
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి కరోనా వైరస్ బాధితులు పెరుగుతున్నారు. ఈ వైరస్ ను అరికట్టేందుకు ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ఇండియాలో ఇప్పటి వరకు 103 మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇద్దరు మృతి చెందారు. ఇండియాలో ఎక్కువగా మహారాష్ట్రలో కరోనా అనుమానిత కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఒక్క ముంబైలోనే 14 మందికి ఈ మహమ్మారి సోకగా, రాష్ట్రవ్యాప్తంగా 39 మంది ఈ వైరస్ బారినపడ్డారు.

కరోనా వైరస్ ను నివారించేందుకు మరో నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర సర్కార్. నాగపూర్ పరిసరాల్లో 144 సెక్షన్ విధించింది. ప్రజలు గుంపులుగా నిల్చోవద్దని అధికారులు సూచించారు. ర్యాలీలు, నిరసన ప్రదర్శనలకు అనుమతి లేదన్నారు.ప్రజల్లో భయాన్ని తొలగించే ఉద్దేశంతో, ప్రజా భద్రత, ప్రజారోగ్యం, శాంతి భద్రతల దృష్ట్యా ఆంక్షల అమలు తప్పనిసరి అన్నారు నాగ్‌పూర్‌ జాయింట్‌ పోలీస్ జాయింట్ కమిషనర్ రవీంద్ర కందం.

- Advertisement -