అమ్మాయిలు ఆ విషయాలు అస్సలు చెప్పరట..!

172
- Advertisement -

అమ్మాయిల కలల ప్రపంచం మ్యారేజ్ అయ్యే వరకే.  అప్పటి వరకి వారి కలల సామ్రాజ్యంలోకి ఎవ్వరినీ రానివ్వరు. తన భవిష్యతు ఎలా ఉండాలి.. ఎలాంటి వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలి ఇలా అనేక ఆలోచనలతో డ్రీమ్స్ లో గడుపుతుంటారు. పెళ్లి అయ్యాక ఇక వారి సర్వస్వం అంతా భర్తే.

తన భార్య ప్రతి విషయం షేర్ చేసుకుంటున్నట్లు ప్రతి మగాడికి అనిపిస్తుంటుంది. కానీ భర్తతో కూడా వారు కాని కొన్ని విషయాలను సీక్రెట్‌గా ఉంచుతారట. తన గత విషయాల గురించి భర్తకు అస్సలు చెప్పరట మహిళలు.
Secrets Your Wife Will Never Tell You
ఒక వేళ మీరు బాహ్యంగా అంత అందంగా లేకపోతే చెప్పేందుకు ఆలోచిస్తారట. వేరే అమ్మాయిలతో భర్త సన్నిహితంగా మాట్లాడితే మనస్సులో విపరీతమైన కోపాన్ని పెంచుకుంటుందట. కానీ  విషయం మాత్రం భర్తతో చెప్పేందుకు చాలా ఆలోచిస్తుందట. మీ భార్య మీ పేరెంట్స్‌తో సన్నిహితంగా ఉండట్లేదంటే…తను వేరే ఫ్యామిలీ పెట్టాలనుకుంటుందని అర్థమట.
 Secrets Your Wife Will Never Tell You
ఆ..విషయం భర్తకు సూటిగా చెప్పలేకే.. ఎక్కువగా తాను చేసే పనిలో చూపెడుతుందట.  త‌ద్వారా ఆమె మ‌న‌స్సును మీకు మీరుగా అర్థం చేసుకుని మకాం మార్చాలన్నమాట. భార్య తనకు అనారోగ్యం కలిగితే వెంటనే భర్తకు తెలియజేయదట. ఇంత చిన్న విషయమే కదా.. అనవసరంగా వారికి చెప్పి ఇబ్బంది పెట్టడం ఎందుకు.. ఎలా వచ్చిందో అలాగే తగ్గిపోతుంది అనుకుంటుందట.

Secrets Your Wife Will Never Tell You

భార్య ఏదైనా విజయం సాధిస్తే తనకు తానుగా తమ భర్తకు చెప్పదట. అలాగే భర్త తనకు తానుగా వారు సాధించిన విజయాన్ని గుర్తించి అభినందించాలని వారు కోరుకుంటుందట భార్య. ఇక బ్యాంకు అకౌంట్ వివరాలను స్త్రీలు బయటపెట్టరట. భార్య దగ్గర ఎంత డబ్బు ఉన్నది తెలుసుకోవడం భర్త కు చాలా కష్టమైన పనే. అలాగే భ‌ర్త సంపాదించినా ఆ డ‌బ్బును ఎక్క‌డా దాస్తుంది…ఎలా సేవ్ చేస్తుంద‌న్న విష‌యాల‌ను భార్య‌లు అస్స‌లు చెప్పరట.

- Advertisement -