మహానటి మొదలైంది…

200
mahanati shoot begins
- Advertisement -

మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగ్ అన్వేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా మరో ముఖ్యమైన పాత్రలో సమంత నటిస్తోంది. ఎవడే సుబ్రమణ్యంతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న నాగ్ అన్వేష్ ఇప్పటికే సావిత్రి జీవితంలో కీలక ఘట్టాలపై హోమ్ వర్క్ కూడా చేశాడు. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ కుమార్తె స్వప్న దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

mahanati shoot begins
ఇక ఇవాళ ఈ సినిమా హైదరాబాద్‌  రామ‌కృష్ణ స్టూడియోలో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. తొలి షాట్‌ని లెజండ‌రీ యాక్ట‌ర్స్ ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, సావిత్రి ఫోటోల‌పై తీశారు.

ఇక సావిత్రి జీవితంలో జరిగిన సంఘటనలు తెలుసుకునే జర్నలిస్ట్ పాత్రలో సమంత కనిపించనుంది. సావిత్రి జీవితంలో కీలకమైన వ్యక్తి జెమినీ గణేశన్. ఆ పాత్రను మాలీవుడ్ నటుడు దుల్కర్ సల్మాన్ చేయనుండగా, విజయ్ దేవరకొండ ..సమంతకి భర్తగా కనిపించనున్నట్టు సమాచారం. ఇక సీనియర్ నటి భానుప్రియతో పాటు రాజేంద్రప్రసాద్ కూడా ఈ ప్రాజెక్ట్ లో ఓ కీలక పాత్ర పోషించనున్నారు. అయితే ప్రస్తుతానికి ఆ పాత్ర వివరాలు సీక్రెట్ అంటున్నాడు నాగ్ అశ్విన్. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుస్తున్న ఈ మూవీకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

- Advertisement -